బీజేపీ స్కెచ్.. కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప.!!

కర్ణాటక ఎన్నికలు జరిగి నెలలు గడుస్తున్నా సీఎం పదవిపై చర్చలు మాత్రం ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.. దానికి కారణం అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటమే.. ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించిన బీజేపీ ప్రతిపక్షానికి పరిమితమైంది.. తరువాతి స్థానంలో నిలిచిన కాంగ్రెస్, బీజేపీకి అధికారాన్ని దూరం చేయటమే లక్ష్యంగా.. తక్కువ సీట్లు సాధించిన జేడీఎస్ కు మద్దతిచ్చి కుమారస్వామిని సీఎం చేసింది.

 

 

అయితే ఇప్పుడు కాంగ్రెస్, జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం పరిస్థితి రంధ్రం పడిన పడవలో సముద్ర ప్రయాణంలా తయారైంది.. మంత్రిపదవులు విషయంలో అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎర వేస్తోందట.. ఇప్పటికే యడ్యూరప్ప, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొందరిని ఢిల్లీలో కలిసి రహస్య మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది.. దీంతో త్వరలో యడ్యూరప్ప సీఎం అవుతారంటూ చర్చలు మొదలయ్యాయి.. అయితే ఈ విషయంపై కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ఖండ్రే మీడియాతో మాట్లాడుతూ కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీజేపీ నాయకులు మాట్లాడారని తమ దగ్గర సమాచారం ఉందని అన్నారు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది, అయితే వారి ప్రయత్నాలు ఫలించవని ఈశ్వర్ ఖండ్రే ధీమా వ్యక్తం చేసారు.. చూద్దాం మరి బీజేపీ కర్ణాటకలో ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందో.