ప్రస్తుతానికి కేటీఆర్ హరీశ్ లే సీఎంలు

 

తెలంగాణ ముఖ్యంమంత్రి కేసీఆర్ ప్రస్తుతం చైనా టూర్లో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర అభివృద్దికి.. అక్కడ పెట్టబోయే పరిశ్రమలు.. వాటి అనుకూలతలు గురించి చైనా పారిశ్రామికవేత్తలకు చెప్పి వారిని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా చేయడానికి ప్రయత్నించే పనిలో పడ్డారు. అయితే కేసీఆర్ పది రోజుల చైనా పర్యటనలో ఉండే ఇక్కడి పరిపాలనా బాధ్యతలు ఎవరు చూస్తున్నారు? ఈ పశ్నకు సమాధానం.. కేసీఆర్ తనయుడు.. ఐటీ మంత్రి కేటీఆర్.. నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్ రావు ఈ బాధ్యతలు స్వీకరించినట్టు తెలుస్తోంది.

ఒకవైపు  హరీష్ రావు రాజకీయ వ్యవహారాలను చూసుకుంటుండగా మరోవైపు కేటీఆర్ పరిపాలన కార్యకలాపాల్లో ఫుల్లు బిజీగా తమ పనుల్లో నిమగ్నమైపోయినట్టు తెలుస్తోంది. కేసీఆర్ లేకపోయిన వీరిద్దరూ పరిపాలనా కార్యక్రమాల సవ్యంగా నిర్వహిస్తున్నారని అందుకు ఇందుకు గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలే నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అనేక అంశాల మీద ఇప్పటికే ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు.. ఈ నేపథ్యంలో హరీశ్ రావు కూడా వారిపై తిరిగి కౌంటర్లు వేస్తూ టీఆర్ఎస్ పై మాటపడనివ్వకుండా ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పికొడుతూ విలేకరులతో ఎప్పటికప్పుడూ ముచ్చటిస్తూనే ఉన్నారు.


అలాగే కేటీఆర్ కూడా ప్రభుత్వ పరంగా చేయబోయే కార్యాక్రమాలపైన మంత్రి కేటీఆర్ హామీలు ఇస్తుండటం ఇందుకు నిదర్శనమని వివరిస్తున్నారు. అంతేకాదు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంపు ఉండదని సీఎం కేసీఆర్ చెప్పినా పెంపు విషయంపై ముఖ్యమంత్రి చైనా నుంచి రాగానే మాట్లాడతానని కేటీఆర్ హామీ ఇవ్వడం పై దూరమవుతున్న కార్మికుల్లో అసంతృప్తి నెలకొనకండా చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనితో పాటు తెలంగాణలో అభివృద్ధిలో వెనుకబడి ఉన్న గ్రామాలను అభివృద్ధి పరిచే దిశగా వారిని ప్రముఖలకు దత్తత ఇచ్చే కార్యక్రమంలో కూడా తన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు.. ప్రకాశ్ రాజ్ తమ వంతుగా ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.

మొత్తానికి కేసీఆర్ లేని లోటును ఈ ఇద్దరు మంత్రులు తీరుస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతానికే ఈ ఇద్దరే తెలంగాణకు సీఎంలుగా వ్యవహరిస్తున్నారు.