కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఖర్మ మాకు లేదు : కేటీఆర్‌

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  కూలగొట్టే కర్మ మాకు లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కంచ గచ్చిబౌలిభూములపై రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని వారం రోజుల కింద చెప్పాని మాజీ మంత్రి స్పష్టం చేశారు. హెచ్‌సీయూ భూముల్లో చేరువును కూడా సీఎం రేవంత్‌రెడ్డి తాకట్టు పెట్టాడు.. రేవంత్ రెడ్డి లాంటి పిచ్చి సన్నాసి తప్ప చెరువును ఎవడు తాకట్టు పెట్టడని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్న ఆ కొంత మంది పోలీసులను ఎవరిని వదిలి ప్రసక్తే లేదు.. మీ మీద కూడా సుప్రీంకోర్టుకు పోతామని ఆయన తెలిపారు. 

రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్న ఆ కొంత మంది పోలీసులను ఎవరిని వదిలి ప్రసక్తే లేదన్నారు. హెచ్‌సీయూ భూముల కోసం పోరాడిన విద్యార్థులు, సామాజికవేత్తలకు అభినందనలు. సెంట్రల్‌ ఎంపవర్డ్ కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు. కంచగచ్చిబౌలి భూమి వర్సిటీ ఆధీనంలో ఉన్నదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సాధికార కమిటీ చెప్పింది. ఆ భూములపై సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలని సూచించింది.వన్యప్రాణులు చనిపోయాయంటే ఏఐ వీడియోలంటూ కేసులు పెట్టారు. రేవంత్‌రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు, పోలీసుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం. కంచ గచ్చిబౌలి భూములపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం. ఆర్థిక దోపిడీ, పర్యావరణపై దాడి విషయంలో ప్రధాని మోదీ స్పందించాలి. చిత్తశుద్ధి ఉంటే రేవంత్‌ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడాలని కేటీఆర్ తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu