కృష్ణాపై సుప్రీంకి తెలంగాణ ప్రభుత్వం

 

కృష్ణా జలాల ట్రైబ్యునల్ కేటాయింపులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నీటి కేటాయింపుల ప్రక్రియ మళ్ళీ చేపట్టాలని తన పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. అయితే ఈ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది. విచారణపై అర్హతపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా సమాధానం తెలపాలని మూడు రాష్ట్రాలను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇదిలా వుండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైతు రుణమాఫీని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ మీద ఏపీ, టీఎస్ హైకోర్టు విచారణ చేపట్టింది. రుణమాఫీకి బ్యాంకులు ముందుకు వస్తే మీకు అభ్యంతరం ఏమిటని పిటిషనర్ మీద కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణను హైకోర్టు మంగళవారం నాటికి వాయిదా వేసింది.