రాహుల్ గాంధీ తో భేటీ కానున్న కోదండరాం

 

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్,టీడీపీ,సీపీఐ,టీజేఎస్ పార్టీలు మహాకూటమిగా ఏర్పడినది విదితమే.అయితే పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తి కాలేదు.తెలంగాణలో మొత్తం 119  అసెంబ్లీ స్థానాలు.119 లో కాంగ్రెస్‌ 95, టీడీపీ 14 స్థానాల్లో పోటీ చేస్తునట్టు సంకేతాలు వస్తున్నాయి.మిగిలిన పది స్థానాలను సీపీఐ,టీజేఎస్ పంచుకోవాల్సిన పరిస్థితి.అయితే టీజేఎస్ అందుకు సుముఖంగా లేనట్లు సమాచారం.టీజేఎస్ తమకు 15 స్థానాలు కావాలంటూ పట్టుబడుతున్నట్లు తెలుస్తుంది.కానీ అందుకు అనుకూలంగా సంకేతాలు లేకపోవటంతో కోదండరాం కొంత అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో కోదండరాంతో చర్చలు జరిపేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి పిలుపు వచ్చింది.రాహుల్ పిలుపు మేరకు కోదండరాం ఢిల్లీ వెళ్లారు. నిన్న రాత్రే ఢిల్లీ చేరుకున్న కోదండరాం ఈరోజు రాహుల్ తో భేటీ అవ్వనున్నారు.రాహుల్‌తో సమావేశానికి ముందే కాంగ్రెస్‌ నేతలు అశోక్‌ గెహ్లోత్‌, జైరాం రమేశ్‌లతో ఆయన సమావేశం కానున్నారు. కూటమిలో తమకు 15 స్థానాలు కావాలంటూ పట్టుపట్టాలని టీజేఎస్ నేతలు నిర్ణయించారు. కోదండరాం వెంట మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌, విద్యాధర్‌రెడ్డి, అంబటి శ్రీనివాస్‌, చింతా స్వామి, బైరి రమేశ్‌, ధర్మార్జున్‌ ఉన్నారు.