రిలీజ్‌కు రెడీ అవుతున్న విక్రమసింహా
posted on Aug 27, 2013 8:26PM

ఎన్నో రోజులుగా రజనీకాంత్ అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్న కొచ్చాడియన్ సినిమా తెలుగు వర్షన్ డబ్బింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాను దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు.
ఫస్ట్ టైం ఓ ఇండియన్ సినిమాకు అవతార్ రేంజ్ గ్రాఫిక్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో రజనీ కళ్లు చెదిరే సాహసాలు చేయనున్నాడు. చాలా భాగం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కిన తొలి ఇండియన్ సినిమా కూడా ఇదే కావటం విశేషం. ఇన్ని విశేషాలు ఉన్న ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మళయాలం భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. అంతేకాదు జపాన్‌లో రజనీకి ఉన్న క్రేజ్‌తో జపనీస్‌లోకి కూడా ఈ సినిమాను అనువదిస్తున్నారు.
రజనీ కుమార్తే సౌందర్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే ప్రముఖ దర్శకుడు కెయస్ రవికుమార్ అందించారు. ఎఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనుంది. తమిళ్‌లో కొచ్చాడియన్ పేరుతో రిలీజ్ అవుతున్న ఈసినిమాకు తెలుగు విక్రమ సింహా అనే పేరును ఫైనల్ చేశారు.