ఇద్దరినీ తప్పిస్తేనే పార్టీకి మనుగడ: కిషోర్ చంద్రదేవ్

 

kiran kumar reddy Kishore Chandra Dev, Kishore Chandra Dev kiran kumar reddy, botsa satyanarayana Kishore Chandra Dev

 

కేంద్ర మంత్రి వి.కిషోర్ చంద్రదేవ్ రాష్ట్ర ముఖ్య నేతలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. అందులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను లక్ష్యంగా చేసుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి అసమర్థ పాలకుడని పేర్కొన్న కిషోర్.. బొత్సను మాఫియా డాన్‌గా అభివర్ణించారు. వీరిద్దరనీ తక్షణం తొలగించాలని.. లేకుంటే పార్టీకి రాష్ట్రంలో ముగడ ఉండబోదని కిషోర్ పేర్కొన్నారు. బొత్స రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారానికి, భూ మాఫియా, అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో డాన్‌లా వ్యవహరిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కిరణ్ కుమార్ రెడ్డి పసలేని సీఎంగా తేల్చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu