టీఆర్ఎస్ నుంచి రాములమ్మ ఔట్

 

 Vijayashanthi Suspended, TRS suspend MP Vijayashanthi

 

 

విజయశాంతి పై టీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. రాములమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్దమైందని వార్తలు వస్తున్న ఆమె ఖండించకపోవడంతో కేసీఆర్ ఆమె పై మండిపడ్డారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విజయశాంతి అనేక సార్లు క్షమించా౦. ఇప్పుడు సస్పెన్షన్ చేస్తున్నాం. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసు ఇస్తాం. పొలిట్‌బ్యూరో ఏకాభిప్రాయం మేరకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు'' అని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

 

విజయశాంతి కొన్నాళ్లుగా టీఆర్ఎస్‌ పార్టీ కార్యాకలాపాల్లో పాల్గొనడంలేదు. ఆమె తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. విభజన అంశంపై అటు రాష్ట్రం, ఇటు కాంగ్రెస్ పెద్దలు తలమునకలైన సమయంలోనే ఆమె ఢిల్లీకి వెళ్లారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో సమావేశమై మెదక్ ఎంపీ సీటుపై హామీ ఇప్పించుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu