కాళేశ్వరం కమిషన్ ఎదుటకు కేసీఆర్

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు  కాళేశ్వరం కమిషన్  ముందు విచారణకు హాజరయ్యారు.  సిద్దిపేటలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ నుంచి  బయలుదేరి ఆయన నేరుగా బీఆర్కే భవన్ కు చేరుకున్నారు.  ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో వెంట ఈ విచారణకు వచ్చేందుకు  మాజీ మంత్రి హరీష్‌రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు ప్రశాంత్‌రెడ్డి, పద్మారావుగౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్సీ మహమూద్ అలీ, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కి కమిషన్ అనుమతించింది.  ఇలా ఉండగా కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరు కావడానికి బయలుదేరుతుండగా ఎర్రవల్లి ఫాం హౌస్ లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరావు కాలు జారి పడిపోయి గాయపడ్డారు. దీంతో ఆయనను సికిందరా బాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు.    ఆ తరువాత మార్గమధ్యంలో కేసీఆర్ కాన్వాయ్ లోని రెండు కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. కమిషన్ విచారణకు హాజరయ్యే ముందు ఈ అపశ్రుతులేంటంటూ బీఆర్ఎస్ శ్రేణులు మధనపడుతున్నాయి. 

కాగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు నేపథ్యంలో బీఆర్క్కే భవన్ కు వచ్చే దారులలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే బీఆర్కు భవన్ లోకి  అందులో పని చేసే ఉద్యోగులను వినా మరెవరినీ అనుమతించడం లేదు. అలాగు బీఆర్కే భవన్, జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు రోడ్డుని పూర్తిగా మూసి వేశారు.  

ఇలా ఉండగా కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావడానికి ముందు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సామాజిక మాధ్యమంలో చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో ఆయన కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు నిలబెడితే ఆయన ఖ్యాతి ఇసుమంతైనా తగ్గదని  పేర్కొన్న కేటీఆర్ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభిస్తున్నప్పటి ఫోటోను ఆ పోస్టుకు జత చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu