మాదే అతిపెద్ద కూటమి అవుతుంది...

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్....పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ ముగిసింది. ఈ సందర్బంగా మీడియా సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ...2019 ఎన్నికల కోసం థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్పించామని.. ప్రత్యేక ఫెడరల్ ప్రంట్ ఏర్పాటు అవశ్యకతపై చర్చించామని తెలిపారు.  రాజకీయ ప్రత్యామ్నయం అవసరం అన్న భావన ప్రజల్లో ఉంది...అభివృద్దే ధ్యేయంగా ముందుకెళ్తాం.. మా పంథా నూతనంగా ఉంటుంది...కలిసి వచ్చే పార్టీలతో సంప్రదింపులు జరుపుతామని అన్నారు.

 

మమతా బెనర్జీ మాట్లాడుతూ.. దేశాభివృద్ది, రైతు సమస్యలపై చర్చించాం..ఫెడరల్ ప్రంట్ పటిష్టంగా ఉండాలి.. ఇందుకోసం ఇతర పార్టీలతో కూడా మాట్లాడుతాం... దేశంలో ఒకే పార్టీ అధికారంలో ఉండకూడదని స్పష్టం చేశారు.