మోడీని 'గాడు' అనలేదు...

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానిని మోడీ గాడు అని వ్యాఖ్యానిండారని చెప్పి రేగిన దుమారం అంతా ఇంతా కాదు. ఇక ఇదే అదునుగా చేసుకొని బేజీపీ నేతలు కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. అంతేకాదు కేసీఆర్ కూతురు.. టీఆర్ఎస్ ఎంపీ కవిత కూడా స్పందించి.. కేసీఆర్ గారు అలా మాట్లాడరు.. ఏదో ఫ్లోలో అలా వచ్చిందేమో అని కవరింగ్ కూడా చేశారు. ఇక ఇప్పుడు తాను చేసిన వ్యాఖ్యలపై కేసీఆరే స్పందించి... బీజేపీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. నేను మోడీగాడు అన్నానని దుష్ర్పచారం చేస్తున్నారు.. మోడీ గారికే అని అన్నా.. మోడీ గాడు అని అనలేదు.. నేను మాట్లాడిన దానికి కట్టుబడి ఉంటా.. నేను ప్రధానిని అగౌరవంగా మాట్లాడాననడం సరికాదు అని స్పష్టం చేశారు. నేను అలా అన్నానని.. బీజేపీ వాళ్లు ఊహించుకుంటే అది వాళ్ల ఖర్మ... కొంత మంది బీజేపీ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. జైలు వెళతారా అని మాట్లాడుతున్నారు... ప్రధానికి ఎదురు మాట్లాడితే జైల్లో పెడతారా..?ప్రధానిని విమర్శించవద్దని రాజ్యాంగంలో ఏమన్నా రాసుందా అని ప్రశ్నించారు. కొందరిని టచ్ చేస్తే భస్మం అయిపోతారు అని హెచ్చరించారు.