ఏపీకి 75 వేల కోట్లు రావాలి..

 

కేంద్రం నుండి ఏడు అంశాల కింద ఇప్పటివరకూ  75 వేల కోట్లు రావాలని గుర్తించామని జేఎఫ్సీ కమిటీ సభ్యుడు జయ ప్రకాశ్ నారాయణ తెలిపారు. జేఎఫ్సీ రిపోర్ట్ లో వివరాల గురించి ఆయన మాట్లాడుతూ.. ఇదేం తుది నివేదిక కాదు.. మాదగ్గర అరకొర సమాచారం మాత్రమే ఉందని అన్నారు. వెనుకబడిన 7 జిల్లాలకు 24 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది.. బుందేల్ ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంది.. డిస్కంల వ్యవస్థీకరణ, పెన్షన్ల పెంపు, ఫిట్మెంట్ బెనిఫిట్ కింద రూ. 10 వేల కోట్లకు పైగా రావాల్సి ఉంది..కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చూపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ.. ప్రత్యేక హోదా ప్రత్యామ్నయం కాదు.. అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ.. రాజధాని నిర్మాణానికి సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానిపై ఉంది..విభజన చట్టాన్నిసరిగ్గా రూపొందించపోవడంతోనే ఏపీకి తీవ్ర నష్టం కలిగిందని తెలియజేశారు.