కేబీఆర్ పార్క్ పేరు మార్చాలని తీన్మార్ మల్లన్న నిరసన
posted on Jun 21, 2025 3:29PM

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ పేరు మార్చాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ కేబీఆర్ పార్కు వద్ద ఆయన ధర్నా చేశారు. కేబీఆర్ పార్కు పేరును తొలగించి వెంటనే ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టకపోతే.. ఆ పని మేమే చేస్తామని డిమాండ్ చేశారు.
వెంటనే కేబీఆర్ పార్క్ ముందు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని కూడా పెట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. తెలంగాణలోని బీసీ సంఘాలు సైతం పేరు మార్పు చేయాలని కోరుతున్నారని తీన్మార్ మల్లన్న అన్నారు. బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ప్రొక్లెయిన్‌తో పెకిలించి అవతల పడేసి జయశంకర్ సార్ విగ్రహం పెడతామని మల్లన్న తెలిపారు.