కవితక్క కథకళీ!

ఈ మ‌ధ్య క‌విత‌క్క కొత్త క‌థ మొద‌లు పెట్టారు. అదేంటంటే.. కాంగ్రెస్ తీసుకొచ్చిన బీసీ ఆర్డినెన్స్ బాగుంద‌ని..  బీఆర్ఎస్ కూడా త‌న దారికి రావ‌ల్సిందేనంటున్నారు. నిజానికి.. క‌విత ఇలా ఎందుకు అనాల్సి వ‌చ్చిదంటే.. ఆమెపై కావ‌చ్చు, ఆమె కుటుంబ స‌భ్యుల‌పై కావ‌చ్చు వ‌రుస పెట్టున న‌మోద‌వుతున్న కేసుల మోత అలాంటిది.

తాజాగా చూస్తే హెచ్ సీ ఏలోనూ కవిత‌క్క హ‌స్త‌ముంద‌ని అంటున్నారు. అంత‌గా ఆమె, ఆమె కుటుంబ స‌భ్యుల అవినీతి  బాగోతం రాష్ట్ర వ్యాప్తంగా న‌లు మూల‌లా విస్త‌రించింద‌ని చెబ‌తారు. మొన్న అరెస్ట‌యిన జ‌గ‌న్మోహ‌న రావు మ‌రెవ‌రో కారు.. హ‌రీష్ రావు కి సోద‌రుడి వ‌రుస అవుతారు. అంటే క‌విత‌కు బావ వ‌రుస‌. ఈ లెక్క‌న చూస్తే ఇందు గ‌ల‌దు అందు లేద‌న్న సందేహంబు వ‌ల‌దు- క‌ల్వ‌కుంట్ల వారి అవినీతి క‌థ‌.. ఎందెందు చూసిన అందందే క‌ల‌ద‌న్న మాట వినిపిస్తోంది.

దీంతో క‌విత‌క్క కాంగ్రెస్ రాగం అందుకున్నారు. అందుకు బీసీ తాళం ఎంచుకున్నారు. తద్వారా  ఛాన్స్ దొరికిన‌పుడ‌ల్లా కాంగ్రెస్ కి తాన తందాన అన‌డానికి చిడ‌త‌లు సిద్ధం చేసుకున్నార‌ని స‌మాచారం. మొన్న‌టి వ‌ర‌కూ ప్రో బీఆర్ఎస్ రాగం ఆల‌పించిన క‌విత‌క్క కొత్త‌గా ఈ కాంగ్రెస్ రాగ‌మాలిక అందుకోవ‌డం వెనుక ఉన్న అస‌లు కథ ఇదీ.  ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో  చేసిన అవినీతి తెలంగాణ నాలుగు చెరగులా విస్త‌రించిన విష‌యం తెలిసిందే. స్వ‌యానా సొంత పార్టీయే ఆమెను సింగ‌రేణి కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తొల‌గించింది. ఇక బ‌య‌ట సంగ‌తి మాటేంటీ? అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఒక ప‌క్క ఢిల్లీ రేంజ్ లో లిక్క‌ర్ కేసు మెడకు ఉచ్చులా త‌గులుకుని క‌నిపిస్తోంది. మ‌రొక ప‌క్క తెలంగాణ‌లోనూ ర‌క‌ర‌కాల కేసులు. తాజాగా హెచ్ సీ ఏ కేసు. ఒక‌టీ రెండు కాదు ఏకంగా 600 కోట్ల రూపాయలకు సంబంధించిన వ్య‌వ‌హార‌మిది. ఇందులో కేటీఆర్ బావ‌మ‌రిదికే కాంట్రాక్టులు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ దిశ‌గా తెలంగాణ క్రికెట్ అసోసియేష‌న్ సీఐడీకి కంప్ల‌యింట్ చేసింది. దీంతో బీఆర్ఎస్ పెద్ద‌ల‌తో మీకున్న సంబంధ‌మేంట‌న్న కోణంలో అరెస్ట‌యిన జ‌గ‌న్మోహ‌న‌రావును ఆరా తీస్తున్నారు విచార‌ణాధికారులు. బీసీసీఐ ఇచ్చిన 600 కోట్లు ఎటు మ‌ళ్లించార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ కేసు చూస్తుంటే తిరిగి  ఈడీ చేతుల్లోకి వెళ్లేలా క‌నిపిస్తోంది.  ఇక్క‌డ కూడా క‌విత‌క్క హ‌స్త‌మున‌న‌ట్టుగా స‌మాచారం. 

ఇన్నేసి  కేసుల్లో పీక‌లోతు ఇరుక్కోవ‌డంతోనే స‌డేన్ గా తెలంగాణ వాదం వినిపించ‌డం, ఆపై బీసీల త‌ర‌ఫు పోరాటాలు.. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఆర్డినెస్ కి  కవిత జైకొట్టి ప్రభుత్వం తన పట్ల ఒకింత సానుకూలంగా వ్యవహరించేలా చూసుకుందాని కవిత భావిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  ముందు ముందు  ఇంకెన్ని క‌విత‌క్క‌ క‌థ‌క‌ళి నృత్యాలు వెలుగులోకి వ‌స్తాయో ఇప్పుడిప్పుడే చెప్ప‌లేం అంటున్నారు కొంద‌రు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu