క్షీణించిన కవిత ఆరోగ్యం...10 కిలోల బరువు తగ్గింది
posted on Jul 20, 2024 2:04PM
మద్యం కుంభకోణంలో కింగ్ పిన్ అయిన బిఆర్ఎస్ కల్వకుంట్ల కవిత ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. డీప్ స్ట్రెస్ లో ఉన్న ఆమె ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు దిగ జారుతోంది. గత నాలుగు నెలల నుంచి తీహార్ జైల్లో మగ్గుతున్న సంగతి తెలిసిందే. గత వారం తీహార్ జైల్లో స్పృహ కోల్పోవడంతో జైలు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హైదరాబాద్ లోని ఆమె నివాసంలో మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. బెయిల్ కోసం ఆమె గత నాలుగు నెలల నుంచి కృషి చేస్తున్నారు. అయితే ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ లభించడం కవితకు సానుకూలాంశం. ఒక్కసారిగా ఆమె 10 కిలోల బరువు తగ్గింది. జైల్లో దోమలు ఎక్కువగా ఉండటంతో ఆమె ఇబ్బందిపడుతున్నారు. కనీస సౌకర్యలు కూడా కరువయ్యాయి. భోజనం కూడా సరిగ్గాలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న కవితకు జైలు జీవితం మరింత స్ట్రెస్ పెంచేలా చేసింది. పొలిటికల్ ప్రొవోకేటెడ్ వల్లే ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చిందని బిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కవిత ఆరోగ్యం పట్ట బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. కవిత భర్త అనీల్ కన్నీటి పర్యంతమయ్యారు. కవిత స్పృహ కోల్పోయిన నాటి నుంచి అనిల్ ఆమె వెంటే ఉన్నారు.