చిదంబరం కొడుకు వచ్చేశాడు..
posted on Jun 1, 2017 1:03PM
.jpg)
కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం, అతని కుమారుడు కార్తి చిదంబరం పై అవినీతి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలో భాగంగానే వారి నివాసంలో సీబీఐ సోదాలు కూడా జరిపింది. అయితే అలాంటి సమయంలోనే కార్తి లండన్ వెళ్లారు. అప్పుడు ఆయన లండన్ వెళ్లడం పెద్ద కలకలమే రేపింది. ఆయన లండన్ కు వెళ్లగా, మరో మాల్యా మాదిరి విచారణను తప్పించుకునేందుకు ఆయన పారిపోయాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు కార్తి ఇండియాకు తిరిగొచ్చాడు. బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన విమానంలో ఈ తెల్లవారుజామున 4 గంటలకు ఆయన చెన్నై వచ్చారు.
కాగా ఒకప్పటి మీడియా దిగ్గజం పీటర్ ముఖర్జియాకు చెందిన ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించేందుకు కావాల్సిన అనుమతుల విషయంలో అక్రమాలు జరిగాయని, అందులో కార్తి చిదంబరం పాత్ర కూడా ఉందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.