బీజేపీ ధీమా.. రేపటివరకూ ఆగండి..


కర్ణాటక రాజకీయాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు కూడా బలనిరూపణకు అనుమతివ్వడంతో ఇప్పుడు ఇంకా ఆసక్తికరంగా మారింది. ఇక దీనిపై స్పందించిన బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. దీనిపై బీజేపీ కర్ణాటక విభాగం ట్విట్టర్లో స్పందించింది. బలపరీక్షలో నెగ్గుతామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. తమకు తగిన సంఖ్యా బలం ఉందని ప్రకటించింది. అంతేకాదు...జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్న విషయం వారికి తెలుసునని, అది రేపు ప్రపంచానికి తెలుస్తుందని పేర్కొంది. మా బలంపై సందేహం ఉన్న వారికి చెప్పేదొకటే, 'వేచి చూడండని' అని పోస్ట్ లో పేర్కొంది. ఆరు కోట్ల మంది కన్నడిగుల ఆశీర్వచనాలు తమకు ఉన్నాయని, వారి దీవెనలను గౌరవిస్తామని,  వారి ఆకాంక్షలను నెరవేరుస్తామని ప్రకటించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu