ఆర్సీబీ బిజినెస్ హెడ్ అరెస్టు.. బెంగళూరు సీపీ సస్పెన్షన్

ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన ఘటనపై సిద్దరామయ్య సర్కార్ సీరియస్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి  బెంగళూరు పోలీస్ కమిషనర్‌పై కర్ణాటక ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. సీపీ దయానంద్‌తో పాటు ఏసీపీ, డీసీపీలను కూడా సస్పెండ్ చేసింది. అలాగే కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్, స్టేషన్ హౌస్ మాస్టర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, చిన్నస్వామి క్రికెట్ స్టేడియం ఇన్‌ఛార్జ్లపై సైతం సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే  ఆర్సీబీ ప్రతినిధులను తక్షణమే అరెస్ట్ చేయాలని సీఎం సిద్ధరామయ్య రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. తొక్కిసలాట ఘటనపై దర్యాప్తునకు  రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక ప్యానెల్‌ను నియమించారు.

ఈ ప్యానెల్ విచారణ జరిపి నెల రోజులలోగా నివేదిక అందించాలని ఆదేశించారు. అాలాగే తొక్కిసలాట  ఘటనపై సీఐడీ దర్యాప్తునకు సీఎం ఆదేశించారు.ఈ ఘటనకు సంబంధించి  ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోలే సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకలకు సంబంధించి ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్  నిఖిల్ సొసలే అనధికారిక ప్రమోషన్స్ చేశారని, అనుమతి లేకుండా పరేడ్ నిర్వహించారన్న ఆరోపణలు ఉన్నాయి.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu