కాంగ్రెస్ కు కపిల్ సిబల్ గుడ్ బై: ఎస్పీ మద్దతుతో రాజ్యసభకు నామినేషన్

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కపిల్ సిబల్ పార్టీకి రాజీనామా చేశారు. అనూహ్యంగా కపిల్ సిబల్ కాంగ్రెస్ కు రాజీనామా చేయడమే కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు.

కపిల్ సిబల్ రాజ్యసభ అభ్యర్థిత్వానికి సమాజ్ వాదీ పార్టీ నాయకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మద్దతు తెలిపారు. కాంగ్రెస్ విధానాలను, హైకమాండ్ తీరును తప్పుపడుతూ వస్తున్న కాంగ్రెస్ రెబల్ గ్రూప్ జి23తో కపిల్ సిబల్ కూడా ఒకరన్న సంగతి తెలిసిందే. కపిల్ రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం కాంగ్రెస్ కు పెద్ద షాక్ అయితే.. ఆయనకు సమాజ్ వాదీ పార్టీ మద్దతు పలకడం మరో పెద్ద షాక్.   చింతన్ శిబిర్ లో సాహసోనేత నిర్ణయాలు తీసుకు న్నామనీ, పార్టీని ప్రక్షాళన చేసి వచ్చే ఎన్నికలలో బీజేపీకి దీటుగా నిలుస్తామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ కు కపిల్ సిబల్ రాజీనామా చేయడం నిజంగా పెద్ద ఎదురు దెబ్బేనని అంటున్నారు. అలాగే బీజేపీని వచ్చే ఎన్నికలలో నిలువరించాలంటే.. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఏకతాటిపైకే రావాలని చెబుతూ వస్తున్న అఖిలేష్ యాదవ్ కపిల్ సిబల్ కు మద్దతుగా నిలవడం అంత కంటే పెద్ద షాకేనని చెప్పాలి.

 కపిల్ సిబల్ కాంగ్రెస్ తో తనకున్న మూడు దశాబ్దాల బంధాన్ని తెంచుకుని బయటకు వచ్చిన నేపథ్యంలో ఒక్కరొక్కరుగా జీ 23 నేతలంతా కాంగ్రెస్ ను వీడుతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జీ23 నేతలు పేరుకే కాంగ్రెస్ లో ఉన్నా గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.  అవకాశం దొరికినప్పుడల్లా వారు పార్టీ అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తున్నారు.  గుతున్నాయి.