అమలాపురం అల్లర్ల వెనక సర్కార్ హస్తం

అనాలోచిత, బాధ్యతా రహిత ప్రభుత్వ నిర్ణయాలు, ఎలాంటి అనర్ధాలకు దారి తీస్తాయో చూపేందుకు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూడేళ్ళ పాలనలో అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. జగన్  రెడ్డి మూడేళ్ళ  తిరగేస్తే అడుగు కొకటిగా అనేక ఉదాహరణలు కపిస్తాయి. పంచాయతీ కార్యాలయాలకు వైసీపే జెండా రంగులు వేయడం మొదలు మూడు రాజధానుల నిర్ణయం వరకు జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు, వివాదంగా మారాయి.

ఆందోళనలకు దారి తీశాయి  న్యాయస్థానాలకు చేరాయి. ఇంచుమించుగా అన్ని కేసులలోనూ, సర్కార్ వెనక్కి తీసుకోక తప్పలేదు. వందల కోట్లు కాదు వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయింది. ఈ క్రమంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఎబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ తాజా ఉదాహరణగా నిలుస్తుంది. రెండు సంవత్సరాల తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఆయనని సర్వీస్’లోకి తీసుకోక తప్పలేదు. ఇదొక తాజా ఉదాహరణ మాత్రమే, ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు ఇంకా అనేకం.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుభవ రాహిత్యం, 151 మంది ఎమ్మెల్యేల బలముందనే రాజకీయ దురహంకారం, ఈ అన్నిటినీ మించి ముఖ్యమంత్రి  సహజ నైజం, 

ఈ   అన్నీ ఒకదానికి ఒకటి తోడై ప్రభుత్వ నిర్ణయాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక అనర్ధాలకు దారి తీస్తున్నాయి.  ఇందులో భాగమే ఇప్పుడు, కోనసీమ జిల్లా పేరు విషయంలో ప్రభుతం తీసుకున్న అనాలోచిత నిర్ణయం సృష్టించిన అరాచకం. అందుకే అమలాపురంలో చెలరేగిన హింసకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.   నిజం అమలాపురం అల్లర్లు తీరు, ప్రభుత్వ స్పందన చూస్తే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నట్లుగా అమలాపురం అల్లర్లు ప్రభుత్వ స్పాన్సర్డ్‌ విధ్వంసమని వేరే చెప్పనవసరం లేదు. నిజానికి ఈ మొత్తం వ్యవహరం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా, ప్రణాళిక బద్దంగా నడిపించిన నాటకం అని, ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు.  సెక్షన్‌ 144 అమలులో ఉన్నప్పుడు, నలుగురు వ్యక్తులు ఒక దగ్గర చేరితేనే పోలీసులు జోక్యం చేసుకుంటారు.

అలాంటిది అమలాపురంలో, సెక్షన్‌ 144 అమలులో ఉండగానే, వందల మంది వీదుల్లోకి రావడమే కాదు, మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేశారు. అయినా  అక్కడా, ఇక్కడా పోలీసులు ప్రేక్షక పాత్రనే పోషించారు. అందుకే,  ఈ దాడులు సర్కార్ స్పాన్సర్డ్ దాడులని  అచ్చెన్నాయుడు ఆరోపించారు. మంత్రి ఇంటిని దుదగులు తగల పెట్టారంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని నిలదీశారు. మంత్రి విశ్వరూప్‌ ఇంటికి ఎందుకు భద్రత కల్పించలేకపోయారని అడిగారు. అమలాపురం ఘటన వెనుక ప్రభుత్వమే ఉందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. హత్య ఘటన నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ విధ్వంసమని అన్నారు. ప్రజల దృష్టి మళ్లించడం డైవర్షన్‌ సీఎంకు బాగా అలవాటని యెద్దేవా చేశారు. కోనసీమను విధ్వంసం చేయాలని జగన్‌ కంకణం కట్టుకున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.అది ధర్మాగ్రహం. ముఖ్యమంత్రి కోనసీమ పై ఎందుకనో కట్టి కట్టారు, అది రాజకీయ ఆరోపణ కాదు, నిజం. అందుకే ఆ ఆరోపణలో నిజం ఉందని కోనసీమ వాసులే కాదు రాష్ట్ర ప్రజలు అందరూ ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.  

అలాగే  ప్లాన్‌ ప్రకారమే కోనసీమలో అల్లర్లు సృష్టించారని బీజేపీ నేత సత్యకుమార్‌ ఆరోపించారు. మంత్రి ఇంటినే దహనం చేశారంటే రాష్ట్రంలో పరిస్థితి అర్థమవుతోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే దాడులు చేశారని మండిపడ్డారు. కోనసీమ కుట్రలో అధికార పార్టీ భాగస్వామ్యం ఉందని అన్నారు. వైసీపీ నేతల్లో కొందురు దాడులను ప్రేరేపిస్తున్నారని విశ్వరూప్‌ అన్నారని తెలిపారు. మరో బీజేపీ నాయకుద రాజయ్ సభ సభ్యుడు, జీవీఎల్ నరసింహ రావు వైకాపాకు అంబేడ్కర్‌ పట్ల గౌరవం ఉంటే,  నవరత్నాలకు ఆయన పేరు పెట్టొచ్చుగా అని ప్రశ్నించారు. అంబేడ్కర్‌ పేరును ఈ ప్రభుత్వం రాజకీయ వివాదంలోకి లాగిందని ఆరోపించారు. విపక్షాల ఆరోపణల విషయం ఎలా ఉన్నా, జగన్ రెడ్డి ప్రభుత్వం గత చరిత్రను చూసినా, కోనసీమ వివాదానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.