అవనిగడ్డ అభివృద్ధి కోసం రాజకీయాలలోకి 'కంఠ౦నేని'

 

 

దివిసీమను స్వర్గసీమగా మార్చడమే ధ్యేయంగా అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ కంఠంనేని శనివారం అవనిగడ్డ ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ రెబల్ అభ్యర్థిగా, ఇండిపెండెంట్‌గా రవిశంకర్ కంఠంనేని నామినేషన్ దాఖలు చేశారు. వాస్తవానికి అవనిగడ్డ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టిక్కెట్ రవిశంకర్ కంఠంనేనికి దక్కాల్సి వుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మండలి బుద్ధప్రసాద్ జంప్ చేయడంతో బుద్ధప్రసాద్‌కి చంద్రబాబు అవనిగడ్డ టిక్కెట్ ఇచ్చారు. అయితే బుద్ధ ప్రసాద్‌కి స్థానిక సమస్యలు, వాటి పరిష్కారం మీద అవగాహన లేదని, ఆయన ఇక్కడ నుంచి గెలిచే అవకాశాలు లేవని స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఎంతోకాలంగా తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేయడంతోపాటు, పదవి లేకపోయిన్పటికీ తన సొంత ప్రాంతం మీద అభిమానంతో అవనిగడ్డ పరిసరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన రవిశంకర్ కంఠంనేనికి అవనిగడ్డ టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో స్థానిక ప్రజలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల ప్రోత్సాహంతో రవిశంకర్ కంఠమనేని అవనిగడ్డ నియోజకవర్గానికి నామినేషన్ వేశారు.

1.Kantamneni Ravi Shankar files Nomination

 

 

2.Kantamneni Ravi Shankar's Political Entry 

 

 

3.Ravi Shankar Kantamneni's Agenda for Divi Seema
 

 

 

4. Kantamneni Ravi Shankar || A true Leader and Public servant