కమల్ హాసన్ సోదరుడు చారుహసన్ పరిస్థితి విషమం.

ప్రముఖ నటుడు కమల్ హాసన్ సోదరుడు , చారుహసన్ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని  ఆయన కుమార్తె, అలనాటి నటి సుహాసిని ధృవీకరించారు. చారుహసన్ అనేక చిత్రాల్లో నటించారు. దర్శకత్వం వహించారు కూడా. చెన్నయ్ లోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ‘‘ మా నాన్న దీపావళి ఒక రోజు ముందు ఆస్పత్రిలో చేరారు. పండగ రోజు ఆస్పత్రిలో గడిపాం. మేజర్ సర్జరీ జరగాల్సి ఉంది అని సుహాసిని ట్విట్టర్ లో భావో ద్వేగంగా రాసుకొచ్చారు.
 93 ఏళ్ళ చారుహసన్ దక్షిణాదికి చెందిన అనేక చిత్రాల్లో నటించారు. దర్శకత్వం వహించారు. 
ఈ ఏడాది ఆగస్టులో ఆయన అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరి చికిత్సపొందారు. మళ్లీ అనారోగ్య సమస్యలు ఆయనను వెంటాడాయి. కన్నడ హిట్  మూవీ తబరన చిత్రంలో ఆయన నటనకు జాతీయస్థాయిలో అవార్డు దక్కింది. ఈ ఏడాది హర అనే తమిళ చిత్రంలో చారుహసన్ కన్పించారు. ఆయకు  సుహాసిని,సుభాషిణి,  నందిని  అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu