యాంకర్ స్వేచ్ఛ సుసైడ్ కేసులో కీలక మలుపు
posted on Jun 29, 2025 12:02PM

యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక మలుపు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్వేచ్చ సుసైడ్‌కి కారణమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ రాత్రి 11 గంటలకు న్యాయవాది సమక్షంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిరు. తన కూతురు స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందర్‌రావే కారణమని.. అతణ్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ మృతురాలి తండ్రి శంకర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పూర్ణచందర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన చిక్కడపల్లి పోలీసుల అదుపులో ఉన్నారు. స్వేచ్ఛ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. స్వేచ్ఛ ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పూర్ణచంద్రను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పూర్ణచందర్ విడుదల చేసిన లేఖ వైరల్‌గా మారింది. ఇక పూర్ణ చందర్ విడుదల చేసిన లేఖలో స్వేచ్ఛ జీవితం, వారి సంబంధం, ఆమె మానసిక స్థితి, కుటుంబ నేపథ్యంకి సంబంధించి అనేక కీలక విషయాలను వెల్లడించారు. తనకు స్వేచ్ఛ 2009 నుంచే తెలుసని, ఆ సమయంలో ఇద్దరం కలిసి ఓ ఛానెల్‌లో పని చేశామని చెప్పారు. అప్పట్లో స్వేచ్ఛ తన వ్యక్తిగత బాధలు, కుటుంబ సమస్యలను తనతో పంచుకుంటూ ఉండేదని గుర్తుచేశారు. కానీ నిజమైన సాన్నిహిత్యం మాత్రం 2020 తర్వాత మొదలైందని ఆయన పేర్కొన్నారు.
2020లో స్వేచ్ఛ తల్లిదండ్రుల నుంచి విడిపోయి హైదరాబాద్‌లోని కవాడిగూడలో ఇల్లు అద్దెకు తీసుకుంది. ఇక 2022లో తన కూతురు అరణ్యని కూడా తన వద్దకు తీసుకువచ్చిందని పూర్ణచందర్ పేర్కొన్నారు. తాజాగా పూర్ణ చందర్ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.స్వేచ్ఛ కూతురు స్టేట్‌మెంట్ ఆధారంగా పోక్సో కేసు ఫైల్ చేశారు. గతంలో తనతో కూడా పూర్ణచందర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు స్వేచ్ఛ కూతురు అరణ్య స్టేట్‌మెంట్ ఇచ్చారు. నమ్మించి మోసం చేయడం.. ఆత్మహత్య కు ప్రేరేపించిన కేసులో.. 69 BNS, 108 BNS సెక్షన్ల కింద కేసు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.