TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ట్రంప్ రికమెండ్ చేసినా నో: జెన్సన్ హువాంగ్ పునరాగమనంపై ఎన్విడియా కుండబద్దలు.!

Published on: Tue Nov 17, 2026 9:13AM

అగ్రరాజ్యాధినేత ట్రంప్ స్వయంగా రికమెండ్ చేసినా తమ సంస్థ మాజీ సీఈవోను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ఎన్విడియా నో చెప్పింది. గత కొద్ది రోజులుగా అంటే ఎన్విడియా మాజీ సీఈవో  జెన్సన్ హువాంగ్ కు మద్దతుగా అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ నిలిచిన తరువాత నుంచి ఎన్విడియాలోకి  జెన్సన్ హువాంగ్ పునరాగమనంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 

తాజాగా ఎన్విడియా ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేసింది.  జెన్సన్ హువాంగ్ ను సంస్థలోకి తీసుకోవాలన్న డిమాండ్ సిలికాన్ వ్యాలీ నుంచి కూడా గట్టిగా వినిపించినప్పటికీ ఎన్విడియా ఖాతరు చేయలేదు. ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రశ్నే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.  

చైనా నిఘా సంస్థతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలిస్ హువాంగ్ అనే మహిళతో  జెన్సన్ హువాంగ్ కు సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తడం, ఆ తరువాత ఆ విషయాన్ని ఆయనే స్వయంగా అంగీకరించడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో  జెన్సన్ హువాంగ్  తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన అనుభవాన్ని, టాలెంట్ ను  దృష్టిలో ఉంచుకుని తిరిగి సంస్థ పగ్గాలు చేపట్టాలని సిలికాన్ వ్యాలీలోని పలువురు ప్రముఖులు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ మేరకు తెరవెనుక  ప్రయత్నాలు కూడా జరిగాయి. అగ్రరాజ్యాధినేత ట్రంప్  జెన్సన్ హువాంగ్ కు బహిరంగంగా మద్దతు పలికారు. ఆయనకు మరో అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. 

అంతేకాకుండా ఆయనపై వస్తున్న గూఢచర్య ఆరోపణలను   ట్రంప్ కొట్టిపారేశారు. అలాగే టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్, టిమ్ స్వీనీ వంటి ప్రముఖులతో పాటు వేలాది మంది ఉద్యోగులు, వాటాదారులు  స్టాండ్ విత్ జెన్సన్  పేరిట ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకాలు చేసి ఆయనకు సంఘీభావం తెలిపారు.

ఇది కూడా చదవండి: భారీగా క్షీణించిన జెన్సన్ హవాంగ్ సంపద: భార్య కానీ విడాకుల కేసు వేస్తే.?

అయితే ఈ ఒత్తిడులను ఎన్విడియా ఖాతరు చేయలేదు.   సంస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని   జెన్సన్ హువాంగ్ పునరాగమనానికి ససేమిరా అంటూ ఎన్విడియా బోర్డు  నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా, సంస్థకు నూతన దిశానిర్దేశం చేసేందుకు తదుపరి సీఈవో అన్వేషణ ప్రక్రియను బోర్డు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆర్మ్ హోల్డింగ్స్ సీఈవో రెనే హాస్ సహా పలువురు ప్రముఖుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

కంపెనీ అంతర్గత వ్యక్తులతో పాటు బయటి వ్యక్తులను కూడా పరిగణనలోకి తీసుకుని సమర్థుడైన నాయకుడిని ఎంపిక చేయాలని బోర్డు నిశ్చయించుకుంది. ఈ నిర్ణయంతో ఎన్విడియాలో జెన్సన్ హువాంగ్ శకం ముగిసినట్లేనని విఅంటున్నారు.  ఇక ఎన్విడియా కొత్త సీఈవో ఎవరు అన్న విషయంపై టెక్ ప్రపంచంలో ఆసక్తి వ్యక్తమౌతోంది.

మీకు నచ్చవచ్చు.  ఆమెతో వివాహేతర సంబంధం నిజమే.. సంచలన విషయం అంగీకరించిన ఎన్విడియా సీఈఓ.!

ఇదో స్పై లవ్ స్టోరీ: ఎన్విడియో సీఈవోకు, అమెరికా గూఢచారితో లవ్ ఎఫైర్.!


[JensenHuangNvidia, Reentry, Trump, Support,  Silicon Valley Demand, , Nvidiaboardno,TeluguOne]