జెఫ్ బెజోస్‌కి బ్యాండ్ పడింది!

పేరుకే అమెరికా... నిజానికి ఏ విషయంలో అయినా అమెరికన్లకి క్షణం క్షణం భయం.. భయం. అలాంటి భయం వల్లే ఈ-కామర్స్ దిగ్గజం జెఫ్ బెజో్స్ తీవ్రంగా నష్టపోయారు. అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితుల వల్ల మాంద్యం భయాలు అమెరికా స్టాక్ మార్కెట్లను ముంచెత్తడంతో అమెజాన్ షేర్లు పడిపోయాయి. దాంతో శుక్రవారం ఒక్కరోజే జెఫ్ బెజోస్‌కి 15.2 మిలియన్ డాలర్లు నష్టం వచ్చింది. అంటే, మన ఇండియా కరెన్సీలో 1.25 లక్షల కోట్లు. శుక్రవారం నాడు జరిగిన ట్రేడింగ్‌లో అమెజాన్ షేరు 8.8 శాతం తగ్గిపోయింది. జెఫ్ బెజోస్‌కి ఈ రేంజ్‌లో లాస్ రావడం ఇది మూడోసారి. 2019లో ఆయన తన విడాకుల ప్రకటన చేసినప్పుడు అమెజాన్ షేర్ పడిపోయింది. 36 బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. ఆ తర్వాత 2022 ఏప్రిల్లో కూడా అమెజాన్ షేర్ 14 శాతం పడిపోయి భారీగా నష్టం జరిగింది. జెఫ్ బెజోస్ ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో వున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu