జగన్ పాలన పై జేడీ లక్ష్మి నారాయణ సంచలన వ్యాఖ్యలు

 

 

గడచిన ఎన్నికలలో టిడిపి, జనసేన పార్టీలతో తలపడి వైసిపి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జగన్ కొత్త ప్రుభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎన్నికలలో తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు. తాజాగా విశాఖపట్నం నుండి జనసేన తరుఫున ఎంపీగా పోటీ చేసిన మరియు జగన్ కేసులను ఇన్వెస్టిగేట్ చేసిన  జెడి లక్ష్మి నారాయణ కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వ పాలన పై స్పందించారు. జగన్ మొట్టమొదటి సారిగా అధికారంలోకి వచ్చినా మంచి నిర్ణయాలు తీసుకొంటున్నారని  రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తుండడం  బాగుందని అన్నారు. అలాగే జగన్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పని చేయడానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి రానున్న రోజుల్లో ఇంకెలాంటి పనులు చేస్తారో చూడాలని అన్నారు. జగన్ ఇచ్చిన హామీలలో మద్యపాన నిషేధం తనకు బాగా నచ్చిందని  అది కూడా దశల వారీగా నిషేధం చేపట్టి పూర్తిగా 5స్టార్ హోటల్స్ కు మాత్రమే పరిమితం చేస్తానని చెప్పడం మంచి నిర్ణయమని జెడి తెలిపారు. అలాగే రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి మరియు ప్రత్యేక హోదా వంటి ఇతర అంశాల్లో కూడా తమ సహాయ సహాకారాలు కూడా కొత్త ప్రభుత్వానికి ఎప్పుడు ఉంటాయని జేడీ తెలిపారు.