ఉత్తరాంధ్రను వణికిస్తున్న జవాద్.. తీరంలో ప్రచండ గాలులు..

ఉత్తరాంధ్రలో జవాదు తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. శుక్రవారం సాయంత్రం నుంచే వర్షాలు మొదలు కాగా.. ప్రస్తుతం ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జవాదు తుపాను తీరం వైపు వస్తున్న కొద్ది వర్ష తీవ్రత పెరుగుతోంది. గాలుల ఉధృతి క్రమంగా పెరుగుతోంది. 

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న జవాద్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది విశాఖకు ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరంలో, పారదీప్‌కు 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని  భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది.  గడచిన కొద్దీ గంటలుగా తుపాను వాయువ్య దిశలో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది.   క్రమంగా దిశ మార్చుకుని ఆదివారం మధ్యాహ్ననికి పూరీ తీరానికి చేరువగా వెళ్లే అవకాశం ఉందని ఐంఎండీ వెల్లడించింది.  ఆదివారం రాత్రికి క్రమంగా బలహీన పడి వాయుగుండంగా మారుతుందని వివరించింది. 

ఒమిక్రాన్.. ఏం చేయాలి? ఏం చేయ‌కూడ‌దు? ఫుల్ డిటైల్స్‌..

జవాద్ తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. తూర్పు గోదావరి జిల్లాలోనూ కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. తుఫాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. సముద్రపు అలలు 3.5 మీటర్ల  ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. జవాద్ తుపానుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తీర ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆ్రఎఫ్ బృందాలను మోహరించారు. ఎలాంటి పరిస్థితి వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ప్రభుత్వం అలర్ట్ చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu