TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కుల్గాంలో భారీ ఎన్ కౌంటర్: సత్ఫలితాలనిస్తున్న కూంబింగ్.!

Published on: Wed Nov 18, 2026 11:29AM

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో  మరోసారి , భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది.  ఉగ్రవాద కదలికలపై అందిన విశ్వసనీయ సమాచారంతో జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగాచేపట్టిన కూంబింగ్ ఆపరేషన్ లో భాగంగా ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.  

కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 

ఈ ఎన్ కౌంటర్ ను కశ్మీర్ జోన్ పోలీసులు అధికారిక ఎక్స్ (ట్విట్టర్) వేదిక ద్వారా ధ్రువీకరించారు. గతంలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి పాల్పడిన వారిలో ఒక ప్రధాన ఉగ్రవాదిని ఇటీవల భద్రతా బలగాలు మట్టుబెట్టగా, ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ కమాండర్ లతీఫ్ భట్ కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

డీజీపీ, ఐజీపీ స్థాయి ఉన్నతాధికారులు స్వయంగా ఈ ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌ను   పర్యవేక్షిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్న బలగాలు, తనిఖీలను ముమ్మరం చేశాయి. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా జరుపుతున్న ఈ ఆపరేషన్‌లో భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్: లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ కమాండర్ హతం.!​

జమ్మూకశ్మీర్‌లో ఇటీవల కాలంలో శాంతిభద్రతలకు విఘాతం కలిపేందుకు ఉగ్రమూకలు మళ్లీ కుట్రలు పన్నుతున్నాయి. అయినప్పటికీ, భద్రతా బలగాలు సమర్థవంతంగా స్పందిస్తూ వాటిని తిప్పికొడుతున్నాయి. ఇటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని భద్రతా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

కుల్గాం మరియు చుట్టుపక్కల జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించడంతో పాటు అదనపు బలగాలను రంగంలోకి దించారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం డ్రోన్లు మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నట్లు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మీకు నచ్చవచ్చు:  జవాన్ సాహసం: భారీ ఉగ్ర దాడి భగ్నం.!

ఉగ్రదాడి బాధితులను పరామర్శించిన హోం మంత్రి అమిత్‌షా​

[JammuKashmir,  Encounter, KulgamGunfight, CRPFAttack, TeluguOne]