జవాన్ సాహసం: భారీ ఉగ్ర దాడి భగ్నం.!
Published on: Thu Nov 12, 2026 9:09AM
.webp)
జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు భారీ దాడి యత్నం, ఓ ఇండియన్ సోల్డ్యర్ ప్రాణాలను లెక్క చేయకుండా జరిపిన ఎదురు దాడితో భగ్నమైంది. సీఆర్‌పీఎఫ్ చెక్‌పోస్టును లక్ష్యంగా చేసుకుని దుండగులు జరిపిన మెరుపు దాడిని, తీవ్రంగా గాయపడిన ఓ జవాన్ తన ప్రాణాలను లెక్కచేయకుండా తిప్పికొట్టారు. ఊహించని ఈ ఎదురు దాడితో ఉగ్రమూకలు పరారయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు.
కుల్గాం పరిసర ప్రాంతంలో ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా ఈ దాడికి పాల్పడ్డారు. అక్కడి మిర్ బజార్ సమీపంలోని సీఆర్‌పీఎఫ్ బూత్‌పై క ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన సైనికులు ఆ దాడిని తిప్పి కొట్టారు.
అయితే ఉగ్ర కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ జవాన్ చూపిన సాహసమే.. భారీ ప్రాణనష్టాన్ని నివారించింది. తీవ్రంగా గాపడినప్పటికీ ఆ జవాన్ అనూహ్యంగా ఉగ్రకాల్పులకు ప్రతి కాల్పులు జరిపి ప్రతిఘటించారు. ఈ ప్రతిదాడితో ఉగ్రమూకలు అక్కడ నుంచి పరారయ్యాయి. దీంతో పక్కా ప్రణాళికతో భా ప్రాణనష్టం లక్ష్యంతో ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడి విఫలమైంది.

ఈ దాడి జరిగిన ప్రదేశానికి అతి సమీపంలోనే సీఆర్‌పీఎఫ్ క్యాంపు ఉండటంతో, బలగాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాద సంస్థలు దాడికి ప్రయత్నించారని అవగతమౌతోంది. జవాన్ల అప్రమత్తత, వల్లే పెను ప్రమాదం తప్పిందని సైనిక వర్గాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: హల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ పై అజిత్ దోవల్ ఏమన్నారంటే?
ఈ ఘటన నేపథ్యంలో కశ్మీర్ వ్యాప్తంగా భద్రతను మరింత కఠినతరం చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఉగ్రవాదుల కదలికలపై నిఘాను మరింత తీవ్రం చేసి, అనుమానాస్పద ప్రాంతాలలో తనిఖీలను విస్తృతం చేయనున్నారు.

ప్రజల రక్షణే ధ్యేయంగా అప్రమత్తంగా ఉన్న భద్రతా బలగాలు, ఉగ్రమూకల కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
మీకు నచ్చవచ్చు: జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్: లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ కమాండర్ హతం.!
భారత్ కి పట్టిన ఉగ్ర పీడ తొలిగినట్టేనా?
[Kulgam, Terrorattack, CRPFjawan, Counterattack, TeluguOne]


