జల్లికట్టు వివాదం.. తమిళనాడు రేపు బంద్..

 

జల్లికట్టు నిషేదంపై తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. మెరీనా బీచ్ వేదికగా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసలు చేస్తున్నాయి. దీనిలో భాగంగానే రేపు తమిళనాడులో బంద్ ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ చేపట్టాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. కాగా గత మూడు రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు జల్లికట్టుకు అనుమతించాలని నినాదాలు చేశారు. అంతేకాదు విద్యార్థుల ఆందోళనకు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా మద్దతు తెలపడంతో జల్లికట్టు ఉద్యమం మరింత ఉద్థృతమైంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu