నేనేమి చేశాను నేరం..!
posted on Nov 26, 2012 9:24AM

హైదరాబాద్ లో మెట్రోరైలు రెండోదశ పనుల మొదలయ్యాయి.. ముఖ్యమంత్రి చేతులమీదుగా పని ప్రారంభించనానికి ఓ భారీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటుచేశారు. మంత్రులంతా ఈ వేదిక మీద పండగచేసుకున్నారు. అయినవాళ్లనీ, కాని వాళ్లనీ అందర్నీ ఆహ్వానించారు.. ఒక్క కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిని తప్ప..
జైపాల్ చాలా బిజీగా ఉన్నారని కొట్టిపారేయడానిక్కూడా ఛాన్స్ లేకుండా పోయింది. ఎందుకంటే.. సమయానికి ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు.. కానీ.. కిణర్ నుంచి కానీ, ఆయన వర్గంనుంచి కానీ సరైన పిలుపు అందలేదు. ఏదో మొక్కుబడిగా ఓ అధికారి వచ్చి ఇన్విటేషన్ ఇచ్చివెళ్లాడు.
సీఎం కుర్చీకి ఎసరొస్తుందని, కిరణ్ కుమార్ ని కుర్చీనుంచి దించేస్తున్నారని వార్తలు గుప్పుమన్నప్పుడల్లా కొత్త ముఖ్యమంత్రి పేర్ల జాబితో రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు జైపాల్ రెడ్డిదే.. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి జైపాల్ మీద అకారణ వైరాన్ని పెంచుకుంటున్నారని రాజకీయ విశ్లేషకుల అంచనా.
అసలు మెట్రోరైలు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్లానింగ్ కమిటీని ఒప్పించింది తనేనని, చివరికి తాను హైదరాబాద్ లో ఉన్నా పిలవకుండా అవమానించే స్థితికి ముఖ్యమంత్రి వర్గం చేరుకుందని జైపాల్ రెడ్డి బాహాటంగానే అసంతృప్తిని వెళ్లగక్కారు. అందరినీ కలుపుకుని పోవడమంటే ఇదేనా అంటూ ఆయన మండిపడ్డారు.
జైపాల్ పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు రాష్ట్రానికి గ్యాస్ కేటాయింపుల విషయంలో పూర్తి నిర్లక్ష్య వైఖరిని అవలంబిచారని కిరణ్ కుమార్ రెడ్డి వర్గం దుమ్మెత్తిపోసింది. వీలు చిక్కినప్పుడల్లా తనతోపాటుగా సమప్రాధాన్యాన్ని పోగేసుకుంటున్నారని అనుమానం కలిగినప్పుడల్లా కిరణ్ వర్గం జైపాల్ ని అవమానించడానికి ఏమాత్రం వెనకాడడంలేదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.