మెట్టు దిగి అసెంబ్లీకి వస్తున్న మాజీ సీఎం!

 ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని ఎంత హడావుడి చేస్తున్నారో అందరికీ తెలుసు. ఆఖరికి స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోర్టు మెట్లు కూడా ఎక్కారాయన. తనకు హోదా వచ్చే వరకు అసెంబ్లీ మెట్లెక్కనని  భీష్మించుకు కూర్చొన్నారు. అంతా తన ఇష్ట ప్రకారమే జరగాలని భావించే మాజీ సీఎంకు శాసనసభ నిభందనలు తెలిస్తే కాని తత్వం బోధ పడలేదు. ఏ శాసనసభ్యుడైనా స్పీకర్‌కు సరైన రీజన్ చూపించకుండా ఆరు నెలల పాటు అసెంబ్లీకి గైర్హాజరైతే అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్‌కి ఉంటుంది.

అయితే స్పీకర్లు తమకు ఉన్న ఆ విచక్షనాధికారాల్ని పెద్దగా ఉపయోగించిన సందర్భాలు కనిపించవు. అయితే ఏపీలో స్పీకర్‌గా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజులను జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో వేధింపులకు గరి చేశారు. వారు ఎక్కడ తమ విచక్షణాధికారాలకు పని చెప్తారో అన్న భయంతో జగన్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం అసెంబ్లీకి రావడానికి రెడీ అయ్యారు.

కేసీఆర్ కూడా తెలంగాణలో అనర్హత వేటు భయంతోనే బడ్జెట్ సమావేశాల రోజు అసెంబ్లీలో అటెండెన్స్ వేయించుకుని వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జగన్ కూడా అదే భయంతో బెట్టు మాని.. మెట్టు దిగుతున్నారు. జగన్ అసెంబ్లీకి వస్తున్నారు సోమవారం శాసనమండలిలోని వైసీపీ కార్యాలయంలో మీటింగ్‌ ఉంది.. సభ్యులంతా హాజరవ్వాలని బొత్స సత్యనారాయణ రాసిన లేఖతో జగన్ అసెంబ్లీ షెడ్యూల్ ఖరారైంది.