జగన్ సభలకు కి‘రాయి’జనాలే.. రాయిదాడి సొమ్ము ఎగ్గొట్టినందుకే!

జగన్ మనమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజాదరణ కరవైందని ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రోడ్ షోలకు జనం ముఖం చాటేస్తున్న దృశ్యాలు  మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ యాత్ర సందర్భంగా ఆయన చేస్తున్న ప్రసంగాలు వినేందుకు కిరాయి ఇచ్చి మరీ రప్పించుకున్న జనం కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు. పదులు, వందల సంఖ్యలో  బస్సులలో ఇతర ప్రాంతాల నుంచి తరలించిన జనం కూడా జగన్ ప్రసంగం మొదలు కాగానే సభా ప్రాంగణాన్ని ఖాళీ చేసి బస్సుల వద్దకు వెళ్లి పోతున్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. 

ఈ నేపథ్యంలోనే  బెజవాడలో సీఎం జగన్‌పై జరిగిన గులకరాయి దాడిపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. జగన్ పై చంద్రబాబు చేసిన హత్యాయత్నంగా ఈ దాడిని అభివర్ణించడానికి వైసీపీ నేల విడిచి సాము చేసింది. స్వయంగా జగన్ కూడా ఈ దాడి వెనుక ఉన్నది చంద్రబాబేనని ఆరోపణలు గుప్పించారు. 
ఒక ముఖ్యమంత్రిపై దాడి కావడంతో ముందువెనుకలు ఆలోచించకుండా  ప్రధాని మోదీ నుంచి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, చివరాఖరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం ఖండించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రకటించి దాడికి పాల్పడిన వారిని పట్టిచ్చిన వారికి రెండు లక్షల రివార్డు కూడా ప్రకటించేశారు.  అలా ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే  పోలీసులు దాడికి సంబంధించి ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణ సందర్భంగా ఆ యువకులు వెల్లడించిన వాస్తవాలు బయటకు పొక్కటంతో  జగన్ సభలకు డబ్బులిచ్చినా, మందు పోసినా జనాలు రావడం లేదన్న సంగతి బట్టబయలైంది.  జగన్ పర్యటనకు వస్తే 350 రూపాయలడబ్బు, మందుబాటిల్ ఇస్తామని తీసుకువచ్చారనీ, తీరా వచ్చిన తరువాత క్వార్టర్ మందుబాటిల్ చేతిలో పఃపెట్టి  డబ్బులు ఎగ్గొట్టారనీ, దాంతో  కోపం వచ్చి  జగన్‌పై రాయి వేశాననీ దాడికి పల్పడిన వ్యక్తి పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ దాడికి ఏ రాజకీయపార్టీతోనూ సంబంధం లేదని  పోలీసులు చెబుతున్నారు.

అదే సమయంలో జగన్ సభలకు వస్తున్న జనం మొత్తం కిరాయి జనమేనని ఈ దాడి ఘటనతో తేలిపోయిందని పరిశీలకులు పోలీసుల విచారణలో తెలిన అంశాలను ఉటంకిస్తూ విశ్లేషిస్తున్నారు.  అదలా ఉంటే జగన్ పై దాడికి పాల్పడ్డారంటూ ఐదుగురు యువకులను పోలీసులు   పోలీసుస్టేషన్‌కు తీసుకురావడంపై  అక్కడి బడుగువర్గా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దాడితో సంబంధం లేని తమ పిల్లలను అన్యాయంగా తీసుకువచ్చారంటూ వడ్డెర కుల స్తులంతా పోలీసుస్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. 200రూపాయలిచ్చి తమను జగన్ మీటింగుకు తీసుకువెళ్లి, ఆ డబ్బులు కూడా ఇవ్వలేదని.. పోలీసులు అదుపులోకి తీసుకున్న సతీష్ అనే యువకుడి తల్లి మీడియా ముందు  చెప్పిన మాటల వీడియో  సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది, వైసీపీ పరువు, జగన్ పరువును రోడ్డు కీడ్చింది.  సింగ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అనే యువకుడే. ఫుట్‌పాత్ కోసం వేసే టైల్ రాయిని సీఎంపైకి విసిరి గాయపరిచాడన్నది పోలీసులు ఆరోపణ.  అతనితోపాటు ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే  పోలీసుల తీరుకు నిరసనగా డాబా సెంటర్‌లో వడ్డెర కులస్తులు భారీ సంఖ్యలో రాస్తారోకో చేయడం సంచలనం సృష్టించింది. మొత్తం మీద జగన్ పై గులకరాయి దాడి ఘటన జగన్ సభలకు డబ్బులు, మద్యం ఆశచూపి జనాలను తరలించడమే కాకుండా, వచ్చిన వారికి చెప్పిన విధంగా డబ్బులు ఇవ్వకుండా వైసీపీ మోసం చేస్తోందని బట్టబయలైంది.   గత ఎన్నికల్లో కోడికత్తి.. బాబాయ్‌పై గొడ్డలిపోటు సానుభూతి దారిలోనే.. రాయిదాడిని భూతద్దంలో చూపి, దానిని జగన్‌పై హత్యాయత్నంగా మలచి, ఓట్లు ఒలుచుకోవాలన్న వైసీపీ వ్యూహంబెడిసి కొట్టింది.