ముగిసిన జగన్ ఢిల్లీ పర్యటన.. మోడీ, అమిదత్ షాలతో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ హస్తిన పర్యటన ముగిసింది. ఆయన అక్కడ నుంచి తిరుగుప్రయాణమయ్యారు. తన ఒక రోజు ఢిల్లీ పర్యటనలో జగన్ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు.

 వీరిరువురితో రాష్ట్రానికి సంబంధించి అంశాలపై చర్చించారని చెబుతున్నారు.  విభజన చట్టంలోని అంశాలు, పెండింగ్ వ్యవహారాలపై ప్రధానికి, హోంమంత్రికి వినతి పత్రాలు సమర్పించారు.  కాగా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో జగన్ హడావుడిగా హస్తిన వెళ్లి ప్రధాని, హోంమంత్రులతో భేటీ కావడానికి కారణాలేమిటన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వివేకా హత్య కేసు దర్యాప్తులో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జగన్ హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu