అక్కడ అన్న.. ఇక్కడ చెల్లి.. నాటకాల కుటుంబం!

అన్నియ్య జగన్, చెల్లెమ్మ షర్మిల ఎవరికివాళ్ళు ఆస్కార్ లెవల్లో యాక్టింగ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఒకవైపు జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్నిగుండంగా మారిపోయింది అని ఇక్కడ అరుపులు, రంకెలు పెట్టి.. ఇప్పుడు ఢిల్లీలో డ్రామా ఆడుతూ వుంటే, మరోవైపు చెల్లెమ్మ షర్మిల మరో వైరెటీ డ్రామా క్రియేట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నందమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల 

పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడతో ఆగొచ్చు కదా.. అలా కాకుండా నడుంలోతు నీళ్లలో దిగి హడావిడి చేశారు. ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలిస్తూనే వుంది. ఇంతలోపే షర్మిల ఇలా నాటకాలు ఆడి, సీన్‌ని రక్తికట్టించే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్‌ని ఇంకా నాశనం చేసి తీరాలని వైఎస్సార్ కుటుంబం తమవంతు ప్రయత్నం చేస్తోంది. వీరి బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలదే!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News