నేను చేసిన తప్పేంటి..?

ఫేస్‌బుక్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్‌లు పెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొని..పదవిని కోల్పోయిన ఐవైఆర్ కృష్ణారావు పోస్ట్‌లపై వివరణ ఇచ్చారు. ఇంటా బయటా ఆరోపణలు రావడంతో ఏపీ బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్‌గా ఐవైఆర్‌ను తొలగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడంతో ఆయన సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. తాను ఏం తప్పు చేశానని ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. జవాబుదారీతనం లేకుండా ప్రవర్తించాననడం..సరికాదన్నారు. ఆర్నెల్ల నుంచి సీఎం అపాయింట్‌మెంట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నా తనకు అవకాశం రావడం లేదన్నారు. బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ పదవిని తానే అడిగి తీసుకున్నానని..వేతనం కూడా తీసుకోకుండా పనిచేశానని చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే ఉద్దేశ్యం తనకు లేదని..అంతటి అర్థబలం, అంగబలం తన వద్ద లేవన్నారు. ఫేస్‌బుక్‌లో పోస్టులపై వివరణ ఇవ్వలేదనటం సరికాదన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu