చిక్కుల్లో సురేష్ బాబు... రామానాయుడు స్టూడియో పై ఐటీ దాడులు

హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో పై ఐటి అధికారుల దాడులు జరుపుతున్నారు. రామానాయుడు స్టూడియోస్ , సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఈ రోజు ( నవంబర్ 20న)  ఉదయం నుంచి ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. హుటాహుటిన అక్కడికి చేసురుకున్నారు సురేష్ బాబు. అధికారులను కలిసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవన్ని ఎప్పుడు చేసే  సాధారణ సోదాలే కంగారు పడాల్సింది ఏమి లేదని అన్నారు. నిర్మాత సురేష్ బాబు ఇంట్లో ఉదయం ఐదు గంటల నుంచే సోదాలు జరుగుతున్నాయి. మొత్తం మూడు టీమ్స్.. మూడు చోట్ల శోదాలు కొనసాగిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి నిర్మాత సురేష్ బాబు నివాసం.. అపోలోఆస్పత్రికి దగ్గరలో ఉన్న సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయంతో పాటుగా.. రామానాయుడు స్టూడియోస్.. మొత్తం మూడు చోట్ల కూడా నాలుగు టీమ్స్ పూర్తిగా సోదాలు చేస్తున్నారు.

గత కొంత కాలంగా ఐటీ రిసర్చ్ కి సంబంధించి సురేష్ ప్రొడక్షన్స్ కి సంబంధించి ఏవైతే లావాదేవీలు ఉన్నాయో వాటికి సంబంధించి డీలింగ్స్ ని కూడా సేకరిస్తున్నారు. మొత్తం ఈ మూడు కార్యాలయాలు ప్రధానంగా ఉన్నాయి కాబట్టి రామానాయుడు స్టూడియోతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్ మొత్తం ఈ మూడు చోట్ల ఐటీ సోదాలు చేస్తున్నారు. వాళ్ళ దెగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ల్స్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అధికారులు. సురేష్ బాబు నడుపుతున్న థియేటర్లు నష్టంలో ఉన్నాయని ఆయన కొద్ది రోజుకు క్రితం తెలిపిన విషయం తెలిసిందే.