అమెరికాపై ఐసిస్ సైబర్ పంజా

ఇరాక్, సిరియాల్లో తమపై వైమానిక దాడులు చేస్తూ భారీ నష్టం కలిగిస్తున్న అమెరికాపై సైబర్ వార్ మొదలెట్టింది ఇస్లామిక్ స్టేట్. ప్రత్యక్షంగా అమెరికాతో పోరాడలేక..ఆ దేశ సాంకేతిక వ్యవస్థపై దాడి చేసింది. ఓహియో రాష్ట్ర గవర్నర్ జాన్ కిసిచ్ కార్యాలయ అధికార వెబ్‌సైట్‌తో పాటు ప్రభుత్వ శాఖలైన రిహాబిలిటేషన్, హెల్త్ ట్రాన్స్‌ఫర్మేషన్, వర్క్‌ఫోర్స్ ట్రాన్స్‌ ఫర్మేషన్‌ల వెబ్‌సైట్లు హ్యాక్ చేసి తమకు అనుకూలమైన నినాదాలు పెట్టారు ఐసిస్ హ్యాకర్లు. తమ దేశాల్లో జరుగుతున్న రక్తపాతానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యత వహించాలని పోస్టుల్లో రాశారు. సమాచారం అందుకున్న నిపుణులు వెబ్‌సైట్లను పునరుద్ధరించే పనిలో పడ్డారు.