మహా సర్కార్‌కు రెండేళ్ళు.. ప్రభుత్వం కులనుందా?

మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడీ (ఎంబీఏ)కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈరోజుకు (నవంబర్ 27)కి రెండేళ్ళు పూర్తయ్యాయి. అనూహ్య పరిణామాల్ అంది 2019 లో శివసేన అధినేత్ ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ఏర్పడిన మూడు పార్టీల (శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ) అఘాడీ ప్రభుత్వం ఈ రెండేళ్లలో అటుపోట్లు అనేకం ఎదుర్కుంది. అయినా అంచనాలను తల్లకిందులు చేస్తూ నిలబడింది. 

నిజానికి, లౌకిక (కాంగ్రెస్, ఎన్సీపీ)  మతోన్మాద (శివ సేన) పార్టీల కలయికతో ఏర్పడిన ప్రభుత్వం అట్టే కాలం మనుగడ సాగించేలదని, రాజకీయ పండితులు తొలి రోజు నుంచీ జోస్యం చెపుతూ వచ్చారు. బీజేపే అయితే, ప్రభుత్వాని  పడగొట్టేందుకు, తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకునేదుకు, అడుగడుగున విఫల ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. 

మహా అయితే ఆరు నెలలు, ఆ తర్వాత కష్టం అన్నారు. అయితే, ఆరు నెలలు, సంవత్సరం దాటి రెండేళ్ళు పూర్తి చేసుకుంది. ముఖ్యమంత్రి, శివసేన  అధినేత ఉద్దవ థాకరేకు గతంలో ప్రత్యక్ష పరిపాలన అనుభవం లేక పోయినా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పరిపాలనా అనుభవంలో ఆరి తేరిన కాంగ్రెస్ నాయకుల సహాయ సహకారాలతో ప్రభుత్వం సాఫీగా సాగిపోతోంది. కాంగ్రెస్ పార్టీ అంత సంతృప్తిగా లేక పోయినా, కూటమి గడప దాటే సాహసం చేయలేక పోతోంది. 

అయితే, మరో రెండు నెలలలో ముంబై మహానగర్ పాలిక సహా ఆరేడు కీలక కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో కూటమిలో కొత్తగా లుకలుకలు మొదలయ్యాయని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని ఇప్పటికే  ప్రకటిచింది. నిజానికి, కార్పొరేషన్ ఎన్నికలు మినీ అసెంబ్ీద ఎన్నికల స్థాయిలో జరుగుతాయని, ఎన్నికల ఫలితాలు భవిష్యత్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని అవిష్కరిస్తాయని అంటున్నారు. 

ఇదలా ఉంటే, మహారాష్ట్రలో  మార్చి నెలలో బీజీపే  ప్రభుత్వం ఏర్పాటవుతుందని కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణే చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. గతంలో శివసేనలో ఉన్నరాణే, శివసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగానూ పని చేశారు.  మరో  ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌లు ఢిల్లీల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకొంది. మరోవైపు ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్, ఆయన సహచరుడు ప్రఫుల్‌ పటేల్‌లు కూడా దేశ రాజధానిలోనే ఉండడంతో ఊహాగానాలు వ్యాపించాయి. శివ సేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్‌లతో కూడిన మహా వికాస్‌ అఘాడీ ఏర్పడి శనివారం నాటికి రెండేళ్లు పూర్తి కానుండడం గమనార్హం.

తొలుత నారాయణ్‌ రాణే రాజస్థాన్‌లోని జైపుర్‌లో విలేకరులతో మాట్లాడుతూ "మహారాష్ట్రలో మార్చి నెలలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది" అని చెప్పారు. దీనిని వివరించమని కోరినప్పుడు "ప్రభుత్వాలు కూలగొట్టడం, ఏర్పాటు వంటివి రహస్యంగా జరుగుతాయి. బహిరంగంగా వీటిపై చర్చలు జరపరని అన్నారు.  బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ కూడా రాణే లెక్క తప్పదని, అది నిజమవుతుందన్న ఆశాభావం వ్యక్తపరిచారు. ఢిల్లీలో ఫడ్నవీస్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసి చర్చలు జరిపినట్టు సమాచారం.ఈ విషయమై నాగ్‌పుర్‌లో పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే విలేకరులతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం పూర్తికాలం పాటు కొనసాగుతుందని చెప్పారు. అయితే, రాజకీయ విశ్లేషకులు మాత్రం, అది రాణే  కోరిక కావచ్చని అంటున్నారు. గతంలో ఫడ్నవీస్ సైతం ఆఘాడీ ప్రభుత్వం అంతర్గత విభేదాలతో దానికదే కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానే, అదేమీ జరగా లేదు. ఆయినా తాజాగా నారాయణ్ రాణే మార్చి లోపు మార్పు ఖాయమని వ్యాఖ్యానించడం మహా రాజకీయాలను హీటెక్కిస్తోంది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో గతంలో చోటు చేసుకున్న అధికార మార్పిడి పరిణామాల రీత్యా మహా రాజకీయాల్లోనూ బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తోందా అన్న చర్చ జరుగుతోంది.