అరెస్టుకు జగన్ ప్రిపేరైపోయారా?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో జగన్ అరెస్టు విషయంలో ఇప్పటి వరకూ ఊహాగాన సభలే జరిగాయి. జగన్ అరెస్టవుతారా? చంద్రబాబు హస్తిన పర్యటన అందుకేనా అంటూ మీడియాలో.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్  హాయాంలో జరిగిన ఈ కుంభకోణం మొత్త ఆ పార్టీ అధినేత, అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లోనే జరిగిందనీ, ఈ కేసులో ఇప్పటి వరకూ అరెస్టైన నిందితులు ఆ విషయాన్ని విచారణలో అంగీకరించారనీ వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ కూడా అందుకు సంబంధించిన ఆధారాలు సేకరించిందనీ, ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు జగనే అన్న నిర్దారణకు వచ్చిందనీ ప్రచారం జరుగుతోంది. 

కానీ ఇప్పుడు జగన్ కూడా తన అరెస్టు అనివార్యమన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. అలా చెప్పడం ద్వారా అరెస్టయ్యేందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నానని అంగీకరించేశారు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మద్యం కుంభకోణంపై సుదీర్ఘంగా మాట్లాడారు. అసలు మద్యం కుంభకోణమే జరగలేదని చెప్పు కొచ్చారు. లిక్కర్ సేల్స్ తగ్గించి… ప్రభుత్వ ఆదాయాన్ని పెంచితే… కంపెనీలకు నష్టమే కదా…మరి నష్టాలు వచ్చినప్పుడు కంపెనీలు ప్రభుత్వ పెద్దలకో, ప్రతినిధులకో ఎందుకు ముడుపులు ఇస్తాయంటూ అమాయకత్వాన్ని ప్రదర్శించారు.  

సరే అధికారంలో ఉండగా తాను చేసినదంతా మంచేననీ, సుపరిపాలన అందించాననీ చెప్పుకున్న జగన్ చివరిగా తనను అరెస్టు చేస్తారన్న ప్రచారంపై మాట్లాడుతూ ఏంజరిగినా దేవుడు చూస్తూ ఉంటాడని వేదాంతం మాట్లాడారు. మొత్తం మీద మీడియా సమావేశంలో జగన్ హావభావాలు, వేదాంత ధోరణిలో మాట్లాడిన మాటలను బట్టి జగన్ అరెస్టునకు మానసికంగా సిద్ధపడినట్లే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu