మరో ఘోర ప్రమాదం..కూలిన వంతెన ఆరుగురు మృతి.. 20 మంది గల్లంతు

 

మహారాష్ట్రలోని పుణెలో  ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కుండమల ప్రాంతంలోని ఇంద్రాయణి నదిపై ఉన్న ఓ పురాతన వంతెన కుప్పకూలింది. దీంతో ఆరుగురు పర్యాటకులు మరణించారు. మరో 25 మంది పర్యాటకులు గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.  ఈ వంతెన కూలిపోవడంతో టూరిస్టులు నదిలో పడి కొట్టుకుపోయారు.

ప్రస్తుతం వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటి వరకు ఆరుగురిని సహాయ సిబ్బంది రక్షించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, వంతెన కూలడంతో ఎంత మంది కొట్టుకుపోయారన్న విషయంలో స్పష్టత లేదని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, 20-25 మంది వరకు గల్లంతై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే సునీల్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆరుగురు మరణించారన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి.