ఇండియాలో సెంచరీ కొట్టిన పెట్రోల్ ధర!

భారత దేశ చరిత్రలో  పెట్రోలు ధర తొలిసారిగా  సెంచరీ  మార్క్ ను తాకింది.  గురువారం రాజస్థాన్ లో బ్రాండెడ్ పెట్రోల్ ధర వంద రూపాయలను క్రాస్ చేసింది.  చమురు సంస్థలు పెట్రోలు ధరను గురువారం  25 పైసల మేరకు పెంచడంతో.. ఆ మేరకు దేశవ్యాప్తంగా ధరలు పెరిగాయి. దీంతో రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో బ్రాండెడ్ పెట్రోలు ధర సరిగ్గా రూ. 101.15ను తాకింది. ప్రస్తుతం శ్రీగంగానగర్ లో సాధారణ పెట్రోలు ధర రూ. 98.40గా ఉంది. 

సాధారణ పెట్రోలు ధర దేశవ్యాప్తంగా రూ. 95 నుంచి రూ. 89 మధ్య కొనసాగుతున్నాయి. ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 86.30గా ఉండగా, ముంబైలో రూ. 92.86కు చేరుకుంది. ముంబైలో బ్రాండెడ్ పెట్రోల్ ధర 96 రూపాయలకు దగ్గరలో ఉంది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రేటు రూ. 89.77 గా ఉంది. హైదరాబాద్ లో బ్రాండెడ్ పెట్రోల్ రేట్ రూ. 92.65 పైసలుగా ఉంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సాధారణ పెట్రోల్ రేట్ 91 రూపాయలు క్రాస్ అయింది . 

జనవరి 9 నుంచి పెట్రోల్ రేట్లు పెరుగుతూనే పోతున్నాయి. ఇదే పద్దతి కొనసాగితే... మరికొన్ని రోజుల్లో దేశ వ్యాప్తంగా పెట్రోల్ రేట్ సెంచరీ క్రాస్ చేయబోతోంది. పెట్రోలు ధరలు రోజురోజుకు పెరిగిపోతుండటంపై వినియోగదారులు ఆందోళన పడుతున్నారు. పెట్రోలు పై విధిస్తున్న విలువ ఆధారిత పన్నులను వెంటనే తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రీమియం పెట్రోల్ లో కాలుష్య కారకమైన ఆక్టేన్ పరిమాణం తక్కువగా ఉంటుంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu