టిక్ టాక్ సహా 59 చైనా యాప్‌లపై నిషేధం

భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన 59 మొబైల్ యాప్‌లను నిషేధించింది. టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, షేర్ ఇట్, హలో, క్యామ్ స్కానర్ తదితర 59 యాప్‌లను కేంద్రం నిషేధించింది. దేశ రక్షణకు, ప్రజా సంక్షేమానికి హానికరంగా భావిస్తున్న కార్యకలాపాలతో సంబంధం ఉందన్న కారణంతో ఈ యాప్ లను నిషేదిస్తున్నామని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.

చైనా సరిహద్దు లడఖ్ లో జరిగిన ఘర్షణలో భారత్ కు చెందిన 21 మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో, దేశవ్యాప్తంగా చైనా అంటే ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. చైనా వస్తువులు, యాప్స్ బ్యాన్ చేయాలనీ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, టిక్ టాక్ వంటి యాప్ లను నిషేధించాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో, కేంద్రం ఈ కీలక నిరణయం తీసుకుంది.