కాల్పుల విరమణపై భారత్-పాక్ మరో కీలక నిర్ణయం
posted on May 15, 2025 10:13PM
.webp)
భారత్-పాక్ ఉద్రిక్తతలను తగ్గించడానికి తదుపరి చర్చలు కొనసాగించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌ల సమావేశంలో నిర్ణయించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. మే 10వ తేదీన ఇరు దేశాల డీజీఎంఓల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు సరిహద్దుల్లో కాల్పుల విరమణ అమలవుతోంది. తాజాగా, ఈ ఒప్పందాన్ని మరింత కాలం కొనసాగించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల మధ్య విశ్వాసం పెంపొందించే చర్యలను కొనసాగించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక బెల్లెట్ కూడా పేల్చకూడదని బోర్డర్ల నుంచి సైన్యాన్ని వెనక్కి మళ్లించాలని తీర్మానం చేసినట్లు పేర్కొంది. అయితే సింధూ జలాల ఒప్పందంపై ఎలాంటి చర్చలు జరగబోవని తేల్చి చెప్పింది. పరిస్థితులు మరింత మెరుగుపడిన కొద్దీ, తదుపరి సమాచారం మీకు తెలియజేస్తాం అని అధికారులు పేర్కొన్నారు.