ఐబీఎల్ లో సైనా కి భారీ ఆఫర్

 

IBL Saina Nehwal,  Saina Nehwal Lee Chong Wei, IBL auction

 

 

ప్రతిష్ఠాత్మక భారత బ్యాడ్మింటన్ లీగ్‌లో ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ను మంచి డిమాండ్ ఏర్పడింది. ఐకాన్ ప్లేయర్ సైనాను రూ. 71.27 లక్షలకు హైదరాబాద్ హాట్‌షాట్స్ దక్కించుకుంది. పురుషుల ప్రపంచ నంబర్‌వ న్ లీ చాంగ్ వీకి వేలంలో అత్యధిక రేటు దక్కింది. ముంబయి మాస్టర్స్ అతడిని రూ. 80.19 లక్షలకు కొనుగోలు చేసింది. ఒలింపిక్ క్వార్టర్ ఫైనలిస్ట్ పారుపల్లి కశ్యప్‌ను బంగా బీట్స్ రూ. 44.55 లక్షలకు దక్కించుకుంది. లక్నో వారియర్స్ వర్ధమాన తార పీవీ సింధును రూ.47. 52 లక్షలకు దక్కించుకుంది.

 

ఇక డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్ప కనీస ధరను తగ్గించారు. తొలుత రూ. 29.75 లక్షలుగా ఉన్న ధరను తర్వాత దానిలోని సగం ధర రూ. 14.85 లక్షలుగా నిర్ణయించారు. జ్వాలను ఢిల్లీ స్మాషర్స్ 18.81 లక్షలకు.. వేలం చివరి నిమిషంలో అశ్వినిని పుణె కనీస ధరకు దక్కించుకున్నాయి.

 


ఆగస్ట్ 14 నుంచి ప్రారంభమయ్యే ఐబీఎల్ మొత్తం 6 ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి. ఒక్కో ఫ్రాంచైజీ 11 మందిని కొనుగోలు చేయగా..అందులో ఆరుగురు భారత్ ఆటగాళ్లు, నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉంటారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News