హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆఫీసును కూల్చేశారు : ఎమ్మెల్యే వసంత

 

హైదరాబాద్ హఫీజ్ పేటలో మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు చెందిన ఆఫీసును పోలీసులు భారీ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేసింది.  హఫీజ్‌పేట్​లోని సర్వే నెంబర్ 79లోని 39 ఎకరాల భూమిలో ఓ ప్రైవేట్ సంస్థ భారీ షెడ్ ఏర్పాటు చేసి నూతన కార్యాలయం చేపట్టడంతో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు శనివారం రోజున కూల్చివేతలు చేపట్టారు. దీనిపై ఎమ్మెల్యే వసంత కృష్ణ మాట్లాడుతు మాకు ఎలాంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు జరిపారని అన్నారు. 2005లో ఈ భూమిని కొనుగోలు చేశామని ఆయన పేర్కొన్నారు. 

ఈ ల్యాండ్ పై ఎలాంటి అభ్యంతరాలు లేవని రంగారెడ్డి కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు వెల్లడించారు. స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసి భూమికి సంబంధించిన పత్రాలు సమర్పించామని తెలిపారు. కానీ హైడ్రా అధికారులు తమ ఆఫీసు కార్యాలయం కూల్చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్సమంత్రి రేవంత్ రెడ్డి  విదేశాల నుంచి రాగానే ఆయనను కలుస్తానని సంత కృష్ణ అన్నారు.. ముఖ్యమంత్రి  తప్పకుండా నాకు న్యాయం చేస్తారన్న నమ్మకం నాకు ఉందని చెప్పారు. హైడ్రా కరెక్ట్ అయితే కోర్టుకు సెలవు ఉన్న రోజే వచ్చి ఎందుకు కూల్చివేతలు జరుపుతోంది ? అంటూ ఆగ్రహించారు. నా వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా హైడ్రా ప్రవర్తించిందని ఎమ్మెల్యే తెలిపారు.