ఆ విషయంలో హైదరాబాదే బెస్ట్...


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కు ఫస్ట్ ర్యాంకు వచ్చింది. ఇంతకీ ఎందులో వచ్చిందనుకుంటున్నారా..? ప్రజలు నివసించేందుకు అత్యత్తమ నగరాల్లో హైదరాబాద్ అన్ని నగరాలనీ వెనక్కి నెట్టి ప్రథమస్థానంలో నిలిచింది. మెర్సర్ అనే గ్లోబల్ హ్యూమన్ రీసోర్సెస్ కన్సల్టింగ్ సంస్థ సర్వే నిర్వహించగా అందులో హైదరాబాద్ మొట్టమొదటి స్థానంలో నిలిచింది. సర్వే ప్రకారం 2016 సంవత్సరానికి గాను భారత్‌లో జీవించేందుకు అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన నగరాల జాబితాను విడుదల చేసింది. పలు అంశాలను పరిగణలోకి తీసుకొని మొత్తం 440 పట్టణాల్లో సర్వేని నిర్వహించగా.. హైదరాబాద్ 139వ ర్యాంక్‌ను సొంతం చేసుకుని ఇండియాలో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో పూణె నిలిచింది.
161 ర్యాంకుతో ఢిల్లీ మూడో స్థానంలో నిలవగా, 152 ర్యాంకతో ముంబై, 160 ర్యాంక్‌తో కోల్‌కత్తా 145 ర్యాంక్‌తో బెంగుళూతు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.