మహిళను ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ఆటో...

 

హైదరాబాద్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను ఆటో ఢీ కొట్టడమే కాదు.. చాలా దూరం లాక్కెళ్లింది. వివరాల ప్రకారం..హైదరాబాద్ లోని అత్తాపూర్ లో ఓ మహిళ నిల్చోని ఉంది. అదే సమయంలో ఒక ఆటో ఆమెను ఢీకొట్టింది. దీనికి ఆగ్రహించిన మహిళ ఆటోను ఆపేందుకు ప్రయత్నించగా..  ఈ క్రమంలో అక్కడి నుంచి తప్పించుకు పోయేందుకు ప్రయత్నించిన డ్రైవర్, తన ఆటో స్పీడ్ పెంచాడు. దీంతో, ఆ మహిళను ఈడ్చుకుంటూ సుమారు రెండు వందల మీటర్ల దూరం ఆటో వెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలవ్వగా.. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.