హైదరాబాద్‌లో భారీ వర్షం..చెరువులను తలపించిన రోడ్లు
posted on Aug 7, 2025 7:41PM
.webp)
హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, షేక్‌పేట్, మణికొండ, హైటెక్ సిటీలో వాన జోరుగా కురుస్తోంది. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మరో రెండు గంటలపాటు హైదరాబాద్‌లో భారీవర్షం కురిసే అవకాశం ఉందని హైడ్రా వెల్లడించింది. ప్రజలు రోడ్లపైకి రావొద్దని, లోతట్టు ప్రాంతాల వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది.. రోడ్లన్నీ జలమయం కావడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు కాలనీల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఈ పరిస్థితుల దృష్ట్యా ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని హెచ్చరించారు.