మెరుపు సమ్మెతో   పెట్రోల్ బంక్ ల ముందు నో స్టాక్ బోర్డ్ లు 

ట్రక్కు డ్రైవర్లకు  హిట్ అండ్ ర‌న్ కేసుల్లో కొత్త చ‌ట్టం ప్ర‌కారం శిక్ష‌ను ప‌దేళ్ల‌కు పెంచారు. దీంతో కొత్త చ‌ట్టంపై దేశ‌వ్యాప్తంగా వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతున్న‌ది. ట్ర‌క్కు డ్రైవ‌ర్లు  మెరుపు సమ్మెతో ఆందోళ‌న చేప‌ట్టి   మంగళవారం విరమించారు. న‌గ‌దు జ‌రిమానాను పెంచ‌డాన్ని కూడా ట్ర‌క్కు డ్రైవ‌ర్లు వ్య‌తిరేకిస్తున్నారు.

కేంద్ర స‌ర్కారు కొత్తగా భార‌తీయ న్యాయ సంహిత చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఐపీసీ స్థానంలో ఆ చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌నున్నారు. అయితే హిట్ అండ్ ర‌న్ కేసుల్లో కొత్త చ‌ట్టం ప్రకారం ట్ర‌క్కు డ్రైవ‌ర్ల‌కు భారీ శిక్ష ప‌డ‌నున్న‌ది. రోడ్డు ప్ర‌మాదాల్లో పెనాల్టీని పెంచేశారు. ఒక‌వేళ హిట్ అండ్ ర‌న్ కేసు అయితే ఆ డ్రైవ‌ర్‌కు ప‌దేళ్ల జైలుశిక్ష ప‌డే ఛాన్సు ఉంది. అనుకోని ప‌రిస్థితిల్లో ప్ర‌మాదం జ‌రిగితే .. ఐపీసీ సెక్ష‌న్ ప్ర‌కారం కేవ‌లం రెండేళ్ల జైలుశిక్ష మాత్ర‌మే ఉండేది. కొత్త చ‌ట్టంలో జైలుశిక్ష‌ను పెంచ‌డాన్ని నిర‌సిస్తూ ట్ర‌క్కు డ్రైవ‌ర్లు దేశ‌వ్యాప్తంగా ధ‌ర్నా చేప‌ట్టి విరమించారు. 

నిర్ల‌క్ష్యంగా వాహ‌నాన్ని న‌డ‌ప‌డం, ర్యాష్ డ్రైవింగ్ వ‌ల్ల జ‌రిగే ప్ర‌మాదాల‌కు కొత్త చ‌ట్టాన్ని అమ‌లు చేయాలని సంకల్పించింది. ఈ కేసుల్లో ఏడేళ్ల జైలుశిక్ష‌తో పాటు భారీ జ‌రిమానా విధించ‌నున్న‌ట్లు భార‌తీయ న్యాయ సంహిత బిల్లులో పేర్కొన్నారు. ఒక‌వేళ ప్ర‌మాదం చేసిన వ్య‌క్తి ఘ‌ట‌న గురించి ఫిర్యాదు చేయ‌కుంటే, అప్పుడు ఆ శిక్ష‌ను ప‌దేళ్ల‌కు పెంచ‌నున్నారు. దీంతో పాటు ఏడు ల‌క్ష‌ల ఫైన్ విధించ‌నున్నారు.

కొత్త చ‌ట్టం క్రూరంగా ఉంద‌ని, భారీ వాహ‌నాల‌కు వ్య‌తిరేకంగా ఉన్న‌ట్లు ట్ర‌క్కు డ్రైవ‌ర్లు ఆరోపిస్తున్నారు. భారీ జ‌రిమానా వేయ‌డాన్ని డ్రైవ‌ర్లు నిర‌సిస్తున్నారు. త‌మ ద‌గ్గ‌ర అంత భారీ అమౌంట్ ఎక్క‌డ ఉంటుంద‌ని ఓ డ్రైవ‌ర్ ప్ర‌శ్నించాడు. ప్ర‌మాద స‌మ‌యంలో గాయ‌ప‌డ్డ‌వారిని త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నిస్తే అప్పుడు జ‌నం దాడి చేస్తున్నార‌ని, ఇది ఆందోళ‌న‌క‌రంగా ఉంటుంద‌ని నిర‌స‌న‌కారులు పేర్కొన్నారు. ట్ర‌క్కు, ప్రైవేట్ బ‌స్సు, గ‌వ‌ర్న‌మెంట్ బ‌స్సు, క్యాబ్ డ్రైవ‌ర్లు ఆందోళ‌న‌లో పాల్గొన్నారు.
మెరుపు సమ్మెతో ఇవ్వాల పెట్రోల్ బంక్ లు కిక్కిరిసిపోయీయాయి. పెట్రోల్ బంక్ ల ముందు నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ట్రక్కు డ్రైవర్లు సమ్మె విరమించడంతో మరికొద్ది సేపట్లో పెట్రోల్ , డీజిల్ వాహనాలు తమ పెట్రోల్ బంక్ లకు వచ్చి ఆయిల్ నింపునున్నాయని బంక్ యజమానులు చెబుతున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu